07-11-2025 12:24:31 AM
రాజాపూర్ నవంబర్ 6: విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తి పెంచేందుకు చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి సుధాకర్ తెలిపారు. గురువారం రాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీంతో కలిసి చెకుముకి పోటీల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ చెకుముకి పోటీల్లో 8,9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
నవంబర్ 12వ తేదీన పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నవంబర్ 21న మండల స్థాయి పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. మండల స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు జిల్లాస్థాయి,రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.