21-05-2025 08:22:03 PM
ములుగు/మహబూబాబాద్ (విజయక్రాంతి): ములుగు జిల్లా పసర ఎస్సై అచ్చు కమలాకర్ తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్(State DGP Jitender) చేతుల మీదుగా ఎస్సై కమలాకర్ ప్రశంసా పత్రం అందుకున్నారు.