21-05-2025 08:09:07 PM
బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సొనాల మండల కేంద్రంలోని ఋషి ఆశ్రమంలో బీహార్ రాష్ట్ర నుండి వచ్చిన గోతి రామ్ కిషోర్ త్యాగి బాబా గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నాడు. గత రెండు రోజులుగా తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థకు గురయ్యాడు. భక్తులు స్పందించి వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బాబాకు నా అంటూ ఎవరూ లేకపోవడంతో భక్తులు దగ్గరుండి సోనాలలోనే సంప్రదాయబద్ధంగా అంతక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఋషి ఆశ్రమ భక్తులు అవనీష్ రాజు, సూరజ్, దశరథ్, సాయి, కిట్టు తదితరులు పాల్గొన్నారు.