21-05-2025 08:04:56 PM
కొండపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదు రోజుల ఉపాధ్యాయ వృత్తి నైపుణ్య శిక్షణ, దుద్దెడలో ఎఫ్ఎల్ఎన్ బుధవారంతో రెండవ రోజు జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని సిద్దిపేట జిల్లా డిఇఓ శ్రీనివాసరెడ్డి(DEO Srinivasa Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఈ శిక్షణ ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం, మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా తమ విద్యా బోధనను మెరుగుపరుచుకోవాలని, ప్రస్తుత ఏఐ టెక్నాలజీకి అనుబంధంగా అప్డేట్ అవ్వాలని అన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో ఇంగ్లీషులో మాట్లాడుతూ బోధిస్తే విద్యార్థులు తొందరగా నేర్చుకుంటారని, ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మధ్యమంలో విద్యాబోధన జరగాలని అన్ని పాఠశాలల్లో ఆంగ్లమధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సంవత్సరం ముందుగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి మండలంలోని పాఠశాలల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యంతో కూడి న ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత రెండు జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. ఈ సంవత్సరం పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ఎన్రోల్మెంట్ పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం క్వాలిటీ విద్యను అందించడంలో భాగంగా ఐదు రోజుల ఉపాధ్యాయ వృత్తి నైపుణ్య, ఎఫ్ఎల్ ఎన్ శిక్షణ ఏర్పాటు చేసిందని, ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, కొండపాక ఎంఈఓ పి శ్రీనివాస్ రెడ్డి, డి ఆర్ పి శ్రీనివాస్ రెడ్డి, రిసోర్స్ పర్సన్లు, పిఎస్ హెచ్ఎం లు, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ సురేందర్, సీఆర్పీలు పాల్గొన్నారు.