calender_icon.png 22 May, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం కోసం అసువులు బాసిన అమరుడు రాజీవ్ గాంధీ

21-05-2025 08:11:42 PM

బోథ్ (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడు, గొప్ప రాజకీయ వేత్త, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని బోథ్ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం బోథ్ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రధానిగా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే నేడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గొర్ల రాజు, అబుద్, భోజన్న, మహమ్మద్ శేఖర్ భోజన్న తదితరులు ఉన్నారు.