calender_icon.png 22 May, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు నోటీసులు.. కాంగ్రెస్ కక్ష సాధింపు పరాకాష్ట

21-05-2025 08:01:42 PM

తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావులకు నోటీసులు జారీ చేయడాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ఖండించారు. ప్రజల గుండెల్లో ఉన్న నాయకులను వేధించడం అన్యాయం అని అన్నారు. కాళేశ్వరం, రైతు బంధు, మిషన్ భగీరథ, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, పింఛన్ పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై అసూయతోనే కాంగ్రెస్ ఇలా కక్ష తీర్చుకుంటోందన్నారు. విచారణల పేరిట వేధిస్తే ప్రజలు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసిఆర్ కు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.