22-08-2025 12:25:57 AM
మంత్రి కి సన్మానం లో ముత్తారం సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరి రావు
ముత్రారం, ఆగస్టు 21(విజయ క్రాంతి): సహకార సంఘాల పదవీకాలం మరో ఆరు నెలల పాటు పొడిగించడం పట్ల ముత్తారం సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరి రా వు తన పాలక వర్గంతో గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందరబంగా మంత్రి శ్రీధర్ బాబుకు పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు.
సహకార సంఘాల్లో మరో మారు రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబుకు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు ఈ సందర్భంగా సంఘ పాలకవర్గ సభ్యుల తరపున ప్రత్యేకతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ చైర్మన్ ఏరువాక కొమురయ్య, డైరెక్టర్లు కొంకటి మల్లయ్య, గోపాల్ రావు, నా యకులు పుదారి సర్వేష్ గౌడ్, లింగారావు, పులిపాక నాగేష్ తదితరులుపాల్గొన్నారు.