04-11-2025 04:41:17 PM
							వామపక్ష, ప్రజాసంఘాల డిమాండ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దహెగాం మండలం గెర్రె గ్రామంలో కుల దురహంకార హత్యకు గురైన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి (రాణి) కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పార్టీను కోరారు. తలండి శ్రావణి(21) పర్దాన్ తెగకు చెందిన ఆమె 2024లో బీసీ(బెస్త) వర్గానికి చెందిన శివార్ల శేఖర్‌ను వివాహం చేసుకుంది.
ఇటీవల 9 నెలల గర్భిణీగా ఉన్న శ్రావణి గత 18 అక్టోబర్ ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మామ శివార్ల సత్తయ్య గొడ్డలితో దాడి చేసి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యలో సత్తయ్యతో పాటు కుమారుడు శివార్ల కుమార్, కోడలు కవిత కూడా పాత్రధారులు అనే తెలిపారు.ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దయ చేశారు.
1. శ్రావణితో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా హత్యకు గురైనందున రెండు హత్యల కేసులు నమోదు చేయాలి.
2. ఎఫ్‌ఐఆర్‌లో మిగతా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి.
3. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి.
4. హత్యలో పాత్ర ఉన్న శ్రావణి భర్త శేఖర్‌ను అరెస్ట్ చేయాలి.
5. జిల్లా కలెక్టర్ తక్షణమే గ్రామాన్ని సందర్శించాలి.
6. గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
7. శ్రావణి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
8. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
9. బాధిత కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలి.
10. కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేయాలి.
11. కుల దురహంకార ఆగడాలు నిలువరించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
12. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి.ఈ కార్యక్రమంలో దుర్గం దినకర్ (KVPS జిల్లా కార్యదర్శి), ఆత్మకూరి చిరంజీవి (AIYF జిల్లా కార్యదర్శి), గొడిసెల కార్తీక్ (DYFI జిల్లా కార్యదర్శి), జె. రాజేందర్ (CITU జిల్లా అధ్యక్షులు), టికా నంద్ (DYFI జిల్లా అధ్యక్షులు), జగజంపుల తిరుపతి (PDSU జిల్లా కార్యదర్శి), మాల శ్రీ (TAGS జిల్లా అధ్యక్షురాలు), పద్మ (AIDWA జిల్లా సహాయ కార్యదర్శి), కోట శ్రీనివాస్ (TAGS జిల్లా ఉపాధ్యక్షులు), కోటేష్ (BRSV), నాగోషే శంకర్ (అఖిల భారతీయ మాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్), ప్రణయ్ (జిల్లా యువజన బీసీ సంఘం అధ్యక్షుడు ) తదితరులు పాల్గొన్నారు.