calender_icon.png 4 November, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

04-11-2025 04:38:23 PM

ఏపీఎం అశోక్..

తుంగతుర్తి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఏపీఎం అశోక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోనీ కొత్తగూడెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కాంట అయిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ఏ గ్రేడ్ కు రూ.2,389, బీ గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ రమేష్,కాంగ్రెస్ పార్టీ  నాయకులు దొనకొండ రమేష్, తిరుమల ప్రగడ కిషన్ రావు, రైతులు చేపూరి రాములు, కాసర్ల రాములు, మట్టపల్లి లింగయ్య, జటంగి యాగయ్య, సైదులు, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.