calender_icon.png 29 July, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

28-07-2025 12:46:12 AM

వేములవాడ టౌన్: జూలై27(విజయక్రాంతి)వేములవాడ శ్రీ రాజరా జేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతు లు తీసుకున్న కోడల సం రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కు మార్ ఝా సూచించారు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్‌లో ఉన్న వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని 85 జతల కోడెలను 170 జీవాలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుకేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు.

కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా.వన మహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలోని రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి నాటారు. అనంతరం గోశాలలో పరిశీలించి..

అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఇం చార్జి ఈఓ రాధాభాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తదితరులు పాల్గొన్నారు.