calender_icon.png 30 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఈ -టెక్నో స్కూల్‌లో ఘనంగా పేరెంట్స్ డే వేడుకలు

28-07-2025 12:47:44 AM

కొత్తపల్లి, జూలై 27 (విజయక్రాంతి): తల్లిదండ్రులు జీవితానికి మార్గదర్శకులని మరియు అద్భుతమైనటువంటి జీవితాన్ని తీర్చిదిద్దేది వారేనని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారి సతీమణి డాక్టర్ వనజా నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించిన టువంటి ‘పేరెంట్స్ డే ఉత్సవ్‘ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

తల్లిదండ్రుల మాటలను అనుసరించిన వారికి మరియు అమలు చేసిన వారికి విజయం తప్పనిసరిగా చేకూరుతుందని మరియు వారి జీవితంలో అత్యుత్తమ స్థానంలో స్థిరపడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. తల్లి దండ్రుల మా టలను క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని మరియు వారిని పరిరక్షించవలసిన బాధ్యత కుటుంబానిదేనని గుర్తు చేశారు.

మన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిదని మ రియు చాలా పవిత్రమైనది అని పలు పురాణాల ద్వారా మనకు తె లుస్తుంది అంతటి విశిష్టత కలిగిన తల్లిదండ్రులను అన్ని రంగాల్లో అన్ని వేళల్లో వారిని మనం మంచిగా చూసుకోవాలని సూచిస్తూ వారి ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేసి అత్యుత్తమ జీవితాన్ని అనుభవించాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు ప్రదర్శించినటువంటి ప లు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప చేశాయి ముఖ్యంగా తల్లిదండ్రులకు నిర్వహించినటువంటి పలు క్రీడలు ఆలోచింపచేసాయి.తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా అత్యుత్తమ ప్రదర్శన క నబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులుపాల్గొన్నారు.