06-11-2025 06:40:29 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఈనెల 15న సుల్తానాబాద్ కోర్టుల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ తెలిపారు. గురువారం బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జడ్జి గణేష్ సమావేశం నిర్వహించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, ప్రమాదాలు, చెక్ బౌన్స్ కేసులు స్పెషల్ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో ఎజిపి దూడం ఆంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు ఆవుల లక్ష్మి రాజం, మాదూరి ఆంజనేయులు, ఆకారపు సరోత్తం రెడ్డి, అవునూరి సత్యనారాయణ, వోడ్నాల రవీందర్, జోగుల రమేష్, ఆవుల శివకృష్ణ, చీకటి సంతోష్, నర్సయ్య, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్ , స్నేహ, రామకృష్ణ పాల్గొన్నారు.