06-11-2025 06:42:15 PM
ఆర్డీవో అశోక్ రెడ్డి
చిట్యాల (విజయక్రాంతి): దేవాలయ, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని గురువారం ఆర్డిఓ అశోక్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ భూములను సర్వే నెంబర్ 201లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, కాలుష్య పరిశ్రమ ఏర్పాటుకు జాతీయ రహదారి నుండి 100 ఫీట్ల వెడల్పు తో భూమిని ఆక్రమించి తారు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని, సర్వేనెంబర్ 199, 200 లో ఏర్పాటు చేసిన హోటల్ నిర్మాణం కొంత దేవాలయ భూమిని ఆక్రమించి నిర్మాణం చేసారని, నవంబర్ 4 న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి కి, ఆర్డిఓ, చిట్యాల ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి, దేవాదాయ అధికారులకు పలుమార్లు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ, పెద్ద కాపర్తి మాజీ ఉపసర్పంచ్ పొట్లపల్లి చిన్న స్వామి గౌడ్, తదితరులు ఫిర్యాదు చేశారు.
అందులో భాగంగా నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈవో నాగిరెడ్డి, ఇన్చార్జి తాసిల్దార్ విజయ, ఆర్ ఐ అమరేందర్ రెడ్డి తదితరులతో కలిసి ఆర్డిఓ సంబంధిత భూములను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పది రోజులలో ఫిర్యాదుదారులతోపాటు దేవాలయ భూములకు నాలుగు వైపులా ఉన్న రైతులకు నోటీసులు అందించి నాలుగు దిక్కుల హద్దురాలను ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులను కూడా పెడతామని, అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన ఏర్పుల యాదయ్య, మాచర్ల యాదగిరి, పొట్ల పెళ్లి చిన్న లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.