25-09-2025 12:15:49 AM
సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్, సెప్టెంబర్ 24 :బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక స్తోమత లేని వారు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం పొంది మానసిక ప్రశాంతతను పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రా మలింగారెడ్డి, డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి,సి డి సి చైర్మన్ ముబీన్, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మం డల అధ్యక్షులు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు, ముల్తాని, భీమయ్య, నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.