06-11-2025 12:49:48 AM
ముషీరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో నిర్వహించిన మహాదేవుని రుద్రాభిషేకంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొని శివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు, ఈఓ లక్ష్మా రెడ్డి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు భవాని, ఆలయ కమిటీ సభ్యులు నవీన్, వేణు, నరసింహ రెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.