calender_icon.png 3 November, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5న వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు

02-11-2025 07:13:04 PM

కొల్చారం: కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారంలోని పురాతన వీరభద్ర ఆలయంలో ఈనెల 5న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి బక్కప్ప తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పూజారులు సంగమేశ్వరప్ప, యోగేశ్వరప్ప, మహేష్ అప్ప ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణంలో దీపారాధన, ఆకాశదీపం వెలిగించడం జరుగుతుందన్నారు.

దీపాల కాంతులు వెలుగులీనుతుండగా మిరుమిట్లు గొలిపే వీరభద్ర ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంటుందన్నారు. భక్తులు బుధవారం నిర్వహించబోయే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో అశేష సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. దీపారాధన కార్యక్రమం, ఆకాశ జ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు.