calender_icon.png 3 November, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

02-11-2025 07:09:01 PM

చిట్యాల (విజయక్రాంతి): పత్తి రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం తెలిపారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలోని ప్రగతి కాటన్ మిల్లులో, పెద్దకాపర్తి గ్రామంలోని కావేరి కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలను ఆయన ప్రారంభించి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏఎంసి చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఏఎంసి సెక్రటరీ వేముల రవీందర్ రెడ్డి, డైరెక్టర్ లు ఏనుగు రఘుమా రెడ్డి, సప్పిడి సంజీవరెడ్డి, బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.