08-08-2025 12:10:06 AM
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న హెచ్‌సిటీ, ఎస్‌ఎన్‌డీపీ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ హెడ్ ఆఫీస్‌లో గురువారం కమిషనర్ కర్ణన్ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌స్పర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డీపీ) ఫేజ్ పనులకు సంబంధించిన భూసేకరణపై సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్‌ఈలు), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈలు), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈలు), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ)తో సమీక్ష సమావేశం నిర్వ హించారు.
ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా ప్రాజెక్టుల వారీగా పురోగతిని కమిషనర్‌కు వివరించా రు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ.. హెచ్‌సిటీ ప్రాజెక్టులను సకాలంలో పూ ర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. నగర స్టార్‌టవాటర్ డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, వరదలను తగ్గించడం కోసం ఉద్దేశించిన ఎస్‌ఎన్‌డీపీ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
పనులకు సంబంధించిన డిజైన్‌లను జీహెచ్‌ఎంసీ డిజైన్ టీమ్‌తోనే ఖరారు చేసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ డిజైన్ టీమ్ బలోపేతానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాము నాయకు, లేక్స్, ఎస్‌ఎస్‌ఎన్‌డీపీ చీఫ్ ఇంజనీర్ జ్యోతిర్మయి ఎస్‌ఈలు పీవీ రావు, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.