calender_icon.png 14 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు సత్వర న్యాయం

14-08-2025 12:02:42 AM

‘గ్రీవెన్స్ డే’లో ఎస్పీ జానకి 

బైంసా, ఆగస్టు ౧౩ (విజయక్రాంతి): భైం సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమం లో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివి జన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పం దించారు.

ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత  పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరి తగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడం జరిగింది. ప్రజలు ‘నిర్మల్ వరకు రావడం కష్టంగా ఉండగా, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడంపై ఎస్పీ చూపిన ఆలోచనను బాధితులు సంతృప్తిని వ్యక్తం  చేశారు. ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.