19-12-2025 12:00:00 AM
తుది జట్టులోకి సంజూ శాంసన్
సూర్యకుమార్ ఫామ్‌పైనే ఫోకస్
టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ పరాజయం నుంచి కోలుకుని వన్డే సిరీస్‌లో సఫారీలను దెబ్బకొట్టిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ విజయంపై కన్నేసింది. నాలుగో టీ20 రద్దవడంతో సిరీస్ డిసైడర్‌కు అహ్మదాబాద్ వేదికగా మారింది. చివరి మ్యాచ్ గెలిచి పొట్టి క్రికెట్‌లో తమ ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. గిల్ లేకపోవడంతో సంజూకు చోటు ఖాయమవగా.. సూర్యకుమార్ ఇప్పటికైనా ఫామ్ అందుకుంటాడా అనేది చూడాలి. మరి షార్ట్ ఫార్మాట్‌లో మరో సిరీస్ భారత్ ఖాతాలో పడుతుందా...లేక సౌతాఫ్రికా బౌన్స్ బ్యాక్ అయి సమం చేస్తుందా..?
అహ్మదాబాద్, డిసెంబర్ 18 : భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. అహ్మదాబాద్ వేదికగా సిరీస్ ఫలితం డిసైడ్ కాబోతోంది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. తర్వాత పుంజుకున్న సఫారీలు సిరీ స్ సమం చేశారు. మూడో మ్యాచ్ లోనూ దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్ ఆధిక్యాన్ని అందుకుంది. అయితే పొగమంచు కారణంగా నాలుగో టీ ట్వంటీ రద్దవడంతో ఇప్పుడు చివరి మ్యాచ్ పై ఫోకస్ పడింది.
ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. కాగా చివరి టీట్వంటీకి భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనర్ శుభమన్ గిల్ గాయంతో సిరీస్ కు దూరమయ్యాడు. నాలు గో టీ ట్వంటీకి ముందే గిల్ గాయంతో తప్పుకుంటున్నట్టు బీసీసీఐ తెలిపింది. నిజానికి గిల్ తప్పుకున్నాడా లేదా తప్పించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఎందుకంటే ఈ సిరీస్ లో గిల్ పూర్తి గా నిరాశపరిచాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో గిల్ ఆట అనుకున్నంత సూపర్ గా లేదు. ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నా టీమిండియా టీ20 టీమ్ లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. మెడనొప్పితో సౌతాఫ్రికా వన్డే, టెస్ట్ సిరీస్ ల నుంచి తప్పుకున్న గిల్ టీ20 సిరీస్‌కు ముుందు ఫిట్ నెస్ సాధించాడు. అతని రాక తో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితయ్యాడు.
అయితే గిల్ మాత్రం మూడు మ్యాచ్ లలో 32 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తప్పించాలన్న డిమాండ్ వినిపించింది. సంజూ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ కు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైం ది. ఇప్పుడు గాయం పేరిటే గిల్ ను పక్కన పెట్టారని భావిస్తున్నారు. అహ్మదాబాద్ లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్‌లో పూర్తిస్థాయి మెరుపులు మెరిపించలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ నుంచి ఇంకా బయటపడలేదు. స్కై ఫిఫ్టీ చేసి దాదా పు ఏడాదిన్నర పైనే అయింది. దీంతో ఈ మ్యాచ్ తోనైనా ఫామ్ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ కు ముందు ఇంకా 6 మ్యాచ్ లో మిగిలున్నాయి. హార్థిక్ పాండ్యా ఫామ్ లో ఉండగా.. దూబే గాడిన పడాలి.
జితేశ్ శర్మ ఫినిషర్ రోల్ లో చోటు దక్కించుకుంటుండగా.. బౌలింగ్ లో మార్పులు జరగనున్నాయి. బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అతను వస్తే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. మరోవైపు టెస్ట్ సిరీస్ ను 2-0తో స్వీప్ చేసి సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. బౌలర్లు మాత్రం పర్వాలేదనిపిస్తున్నా రు. ఓవరాల్‌గా చివరి మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.
పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్ స్టేడియంలో పిచ్ సహజంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆరంభం పేసర్లకు కాస్త అనుకూలించినా ఓవరాల్‌గా ఈ పిచ్‌పై భారీస్కోర్లు నమోదవుతుంటాయి. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపుతుంది.
భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదన్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, దూబే, జితేశ్ శర్మ, కుల్దీప్ యా దవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా/ హర్షిత్ రాణా, అర్షదీప్
సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)
డికాక్(కీపర్), మార్క్మ్ (కెప్టెన్), స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, మార్కో యెన్సన్, సిపామ్ల,/కార్బిన్ బోస్చ్, కేశవ్ మహారాజ్/బార్ట్‌మన్, ఎంగిడి, నోర్జే