16-12-2025 12:21:01 AM
ఆర్డీవో జనార్దన్ రెడ్డి
కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 15 : క్రీడలతో మానసికొల్లాసం లభిస్తుందని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులను సందర్శించి వారితో మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. వసతి గృహంలోని ఉంటున్న విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రవికుమార్, ఇతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.