calender_icon.png 14 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలి

14-11-2025 12:41:45 AM

కలెక్టర్ ఆశీష్ సంగువాన్

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతు లు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. గురువారం ఉత్పత్తిదారుల సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్ ల నిర్వాకులకు కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో  రైతు ఉత్పత్తిదారుల సంస్థల  వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణశిక్షణా కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని  ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ , నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్లు, వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు ,సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షేర్ క్యాపిటల్, మేనేజ్మెంట్ ఖర్చుల నిధులను సమర్థంగా వినియోగించుకుని ఎఫ్ పి  ఓల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ సి ఎం డైరెక్టర్  గణేశన్, ఎన్ సి డిసి రీజినల్ డైరెక్టర్  సర్దూల్, కామారెడ్డి జిల్లా సహకార అధికారి, అలాగే ఐ సి ఎం, ఎన్ సి డి సి అధికారులు, ఎంపిక చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థల అధ్యక్షులు, ఎఫ్పిఓ డైరెక్టర్లు,  ప్రతినిధులు పాల్గొన్నారు.

లోడ్ చేసిన  ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే హమాలీ లు సంచులలో నింపి లారీల లో లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎల్లారం  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడారు.

త్వరగా వడ్లను సంచుల్లో నింపి త్వరగా లారీల్లో లోడ్ చేయాలని హమాలీలను ఆదేశించారు. త్వరితగతిత పూర్తి చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు అవుతున్నాయా పేమెంట్స్ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి వెంటనే కంట చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, పాల్గొన్నారు.