calender_icon.png 14 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగం బలోపేతమే లక్ష్యం

14-11-2025 12:41:38 AM

-నెహ్రూ స్పూర్తితోనే మెరుగైన మార్పులు 

-పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

-బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెహ్రూను స్మరించు కున్నారు. బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని బాల బాలిలకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

బాలలను జాతి సంపదగా భావించి వారి మెరుగైన భవితకు కృషి చేయాలన్న నెహ్రూ ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు.  నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి పేర్కొన్నారు.

చదవుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని ఆయన తెలిపారు.  విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. అలాగే  పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయసహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.