14-11-2025 12:43:16 AM
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి) : విద్యార్థులు సక్సెస్ సాధించాలంటే టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాదిం చాలని ఐటీ, పరిశ్రమలు, శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీ శాట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశా లల విద్యార్థుల రాష్ర్ట స్థాయి వార్షిక పోటీలు-- విజేతల బహుమతి ప్రదానోత్స వానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరై మా ట్లాడారు.
సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులు ఉత్త మమైన ఫలితాలు సాధించాలన్నారు. మేథో సంపత్తికి టీ-సాట్ సాంకేతికతను ఉపయోగిం చుకుని తమ భవిష్యత్‌కు గట్టి పునాదులు వేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
టీ సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీ సాట్‌కు ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు సంపూర్ణ మద్దతు అం దిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీసాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ రాజ్‌గంగారెడ్డి, గిరిధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.