14-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు, స్కూళ్లు సంయుక్తంగా వార్షిక సాంస్కృతిక, విద్యా మహోత్సవం ‘రెసోఫెస్ట్ 2025’ను గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా ఈ వేడుక వైభవంగా సాగింది. రెండు రోజుల ఈ వేడుకలో మొదటి రోజు హైదరాబాద్, తెలంగాణలోని 35 క్యాంపస్లకు చెంది న ఏడు వేల మందికి పైగా విద్యార్థులు ఉ త్సాహంగా పాల్గొన్నారు.
ఈ ప్రారంభ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హా జరయ్యారు. వీరిలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య, జాగిల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాజ్ పీ నారాయణ, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ సీఈఓ, ఎం డీ డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ దర్శకులు నాగ్‌అశ్విన్, నటులు శర్వానంద్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, యాంకర్ సుమ కనకాల, సినీ నటి ఆనంది పాల్గొన్నారు.
ఈవెనింగ్ వేడుకలో నృత్యం, సంగీతం, నాటక రంగా ల్లో ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అంతర్ క్యాంపస్ పోటీల్లో విజేతలైన విద్యార్థులను, ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన వారిని సత్కరించారు. రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూష న్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ‘రెసోఫెస్ట్’ అనేది జిజ్ఞాస, సృజనాత్మకత, స్వభావం అనే మూడు అం శాలపై పండుగ అన్నారు. ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదని, రెసోనెన్స్ ఆత్మను ప్రతిబింబించే కార్యక్రమం అన్నారు.
రెసోనెన్స్ తాత్త్విక దృక్పథం ’నిష్ఠతో మేధస్సును పెంపొందించడం’ అనే విలువలపై ఆధారపడి ఉందన్నారు. రెసోనెన్స్ ఒకే విజన్ నుం చి ప్రారంభమై స్కూ ల్స్, జూనియర్ కాలేజీలు, ఫౌండేషన్ ప్రోగ్రామ్లు, ఈ-లెర్నింగ్ వి భాగాలను కలిగి ఉన్న సమగ్ర విద్యా వ్యవస్థగా ఎదిగిందన్నారు. హైదరాబాద్లో 16 కొ త్త రెసోనెన్స్ స్కూల్ క్యాంపస్లను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో విమ ర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, బాధ్యతతో జీవించే గుణాలను పెంపొందించే విద్యా అనుభవాన్ని అందిస్తామన్నారు.