calender_icon.png 5 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారిణికి చైతన్యశ్రీకి ఘనంగా సన్మానం

05-07-2025 12:07:20 AM

సిద్దిపేట, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయి ప్రాబబుల్స్ కి ఎంపికైన సిద్దిపేట ఫుట్బాల్ ప్లేయర్ చైతన్యశ్రీ ని డివైఎస్‌ఓ వెంకట నర్సయ్య, స్పోరట్స్ కన్వీనర్ పాల సాయిరాం, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్యశ్రీ ఇండియన్ ఫుట్బాల్ టీం జెర్సీ ధరించాలని ఆకాంక్షించారు.

సిద్దిపేట ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్ మాట్లాడుతూ సిద్దిపేట నుండి జాతీయ స్థాయికి ఎదిగిన చైతన్యశ్రీ కి అభినందనలు తెలిపారు. ఫుట్బాల్ నేర్పిన కోచ్ గా గర్వపడుతున్నని తెలిపారు. టీం ఇండియా తరుపున చైతన్య శ్రీ ఆడుతుందని దీమా వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా జూనియర్ గరల్స్ ఫుట్బాల్ టీం ఎంపిక..

సిద్దిపేట జిల్లా జూనియర్ గరల్స్ ఫుట్బాల్ టీం ఎంపిక పూర్తయ్యిందని సిద్దిపేట సెలక్షన్ కమిటీ సభ్యులు అక్బర్ నవాబ్, నర్సింములు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ఫుట్బాల్ గ్రాస్ గ్రౌండ్ లొ నిర్వహించిన సెలక్షన్స్ లొ జిల్లా వ్యాప్తంగా 35 మంది ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు.

ఫుట్బాల్ ప్లేయర్స్ లొ స్టామినా, బాల్ టచ్, రన్నింగ్, షూటింగ్, పాసింగ్ కో ఆర్డినేషన్ లాంటి విభాగల్లో వారి సమర్ధతను పరిశీలించి 20 మంది క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 8 నుండి ఆదిలాబాద్ లొ జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రటరీ సాజిద్, తదితరులు పాల్గొన్నారు.