04-08-2025 01:05:56 AM
సూర్యాపేట, ఆగస్టు 3 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుజాత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాలలో కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లు కలవని ఆసక్తి కలిగిన పదవ తరగతి పాసైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 10 వరకు కళాశాల యందు సమర్పించాలన్నారు.
11న అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్దినులకు హాస్టల్ సదుపాయం కలదనీ చెప్పారు పూర్తి వివరాల కోసం 9866385292, 8247457629, 9394744491 నెంబర్లను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.