calender_icon.png 19 August, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ స్పేస్ ఐడియాతన్ లో ద్వితీయ బహుమతి పొందిన ఎస్పిఆర్ విద్యార్థులు

18-08-2025 11:15:06 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): నేషనల్ స్పేస్ ఐడియాతన్ వికసిత్ భారత్ ఐఐటి, ఇస్రో తిరుపతి వారు నిర్వహించిన స్పేస్ టెక్నాలజీస్, అప్లికేషన్స్ ఎర్త్ & బియాండ్ 2025 అనే పోటీల్లో కామారెడ్డి ఎస్ పి ఆర్ విద్యార్థులకు ద్వితీయ బహుమతి లభించింది. భారతదేశంలోని 400లకు పైగా పాఠశాలలు పాల్గొన్నాయి. దీనిలో 100 పాఠశాలలు మాత్రమే ఎంపిక అయ్యాయి. దీనిలో భాగంగా స్మార్ట్ బిన్ క్యూఆర్ కోడ్ అనే అంశంపై ప్రాజెక్టు చేసి జాతీయ స్థాయిలో, కామారెడ్డి యస్.పి.ఆర్. విద్యార్థులు కౌశిక్, రాణా మహాదేవ్లలు, ఐ. స్పేస్ ఫౌండర్ & సి.ఈ.వో. సూర్యకమల్ పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని పొందారు.