19-08-2025 12:42:29 AM
టేకులపల్లి, ఆగస్టు 18, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తో కలిసి టేకులపల్లి మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పాతతాండా - రాంపురం మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తడికలపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు, పెట్రాంచెలకలో రోడ్డు, వంతెన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
కిష్టారం నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రికి, ఎమ్మెల్యేకు ప్రజలు గ్రామాల్లో హరతులతో, పూల వర్షంతో, ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు డీజే, బ్యాండ్, టపాసుల మోతలతో భారీ జన సంద్రంతో పండగ వాతావరణంతో గ్రామాలు నెలకొన్నాయి. మారు మూ ల ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. ఎన్నో ఏళ్లుగా మేము తాము చూస్తునటువంటి తమ కోరిక నెరవేరిందంటూ ఆనందాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పటేల్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఆర్దీవో మధు, తహశీల్ధార్ వీరభద్రం, ఎంపీడీఓ మల్లీశ్వరి, ఇల్లందు డీఎస్ పీ చంద్రభాను, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి, బోడు ఎస్త్స్ర లు రాజేందర్, శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.