calender_icon.png 19 August, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

19-08-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి  బొల్లారంలో రూ.2.75 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన 

జిన్నారం(గుమ్మడిదల), ఆగస్టు 18 : పారిశ్రామికవాడగా పేరొందిన బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీ, శక్తి ఎంక్లేవ్, శ్రీ రామ్ నగర్ కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, బీరప్ప బస్తి, జ్యోతి నగర్, మల్లన్న బస్తి, బాలాజీ నగర్, ఓల్డ్ విలేజ్ కాలనీలలో రూ.2.75 కోట్లతో చేపట్టనున్నసీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ అంజి రెడ్డి,  స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీల లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా నిరంతరం సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, కమిషనర్ కిషన్, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 18 : గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లిలో సోమవారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం బోనాల ఉత్సవానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీఐ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్యనారాయణ, నరసింహ, నవీన్ కుమార్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.