calender_icon.png 18 August, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

18-08-2025 01:35:37 AM

ఆదిలాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆదిలాబాద్ లో వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ లోని అతి పురాతనమైన అలయమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గోకులాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం చేపట్టిన గోపాల కాల కార్యక్రమలో ఎమ్మెల్యే పాయ ల్ శంకర్ పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

అనంతరం మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామితో కలిసి ఎమ్మెల్యే పుగిడి ఆడుతూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపా రు. మరోవైపు యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామ న్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచి శ్రీకాంత్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు రవికిరణ్ యాదవ్, హన్మాండ్లు యాదవ్, సేవ్వా జగదీష్, వేణు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.