16-09-2025 06:18:30 PM
మెట్‌పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ టీచర్లకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండవ రోజు పోషణ్ భీ పడాయి భీ శిక్షణాను అంగన్వాడి టీచర్లకు అందించారు. మెట్‌పల్లి అర్బన్, రూరల్, ఇబ్రహీంపట్నం మండలంలోని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సిడిపివో మణెమ్మ రెండు మండలాల అంగన్వాడి టీచర్లు , సూపర్ వైజర్ లు షమీoసుల్తానా,ప్రతిభ సిబ్బంది ప్రశాంత్, మానస పాల్గొన్నారు.