calender_icon.png 16 September, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ అరెస్టు

16-09-2025 06:35:02 PM

హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్(ADE Ambedkar) అరెస్టు అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏడీఈ అంబేడ్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం అంబేడ్కర్ ను రిమాండ్ కు తరలించనున్నారు. కాగా ఉదయం నుంచి అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. బంధువు ఇంట్లో రూ.2 కోట్లు గుర్తించగా.. శేరిలింగంపల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంబేడ్కర్ భారీగానే ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు నిర్థారించారు. ఇబ్రహీంబాగ్ లో ఏడీఈగా అంబేడ్కర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే.