16-09-2025 06:44:34 PM
భయాందోళనలు రైతన్నలు..
విచారణ చేస్తున్న అటవీశాఖ అధికారులు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దముల్ మండలం తట్టేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేడు అటవీ ప్రాంతం నుండి పంట పొలాల మీదుగా చిరుత పులి వెళ్ళినట్టుగా గుర్తించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, సెక్షన్ బీట్ అధికారులు స్వప్న, నాగ సాయిలు అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్ళ కోసం గాలించారు. ఈ సందర్భంగా అధికారులకు మాట్లాడుతూ చిరుత అడుగులుగా గుర్తించామని పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అన్నారు. అనంతరం తగు చర్యలు చూసుకుంటామని తెలిపారు.