calender_icon.png 16 September, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బెల్లంపల్లిలో రావణ దహనాన్ని అడ్డుకుంటాం

16-09-2025 06:26:37 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రానున్న విజయదశమి రోజున బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో నిర్వహించే రావణ దహన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం బెల్లంపల్లిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత సంఘాల నాయకుల, సభ్యుల నుండి అభిప్రాయాలు సేకరించారు. రావణాసురుడు దహనం పేరుతో బిజెపి, ఆర్ఎస్ ఎస్, హిందూ ఉత్సవ కమిటీ వాటి అనుబంధ సంస్థలు వ్యాపారుల దగ్గర, రాజకీయ నేతల దగ్గర డబ్బులు వసూలు చేసి రావణున్ని దహనం చేస్తూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. రావణాసుర దహనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని అధికారులను వేడుకున్నారు.