calender_icon.png 9 September, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ముగిసిన శ్రీ సిద్ధి గణపతి రథోత్సవం, బ్రహ్మోత్సవాలు

08-09-2025 12:57:32 AM

పటాన్ చెరు, సెప్టెంబర్ 7 :పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారంలో ప్రసిద్దిగాంచిన శ్రీ సిద్ధి గణపతి, గణేష్ గడ్డ దేవస్థానాల్లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు.

ముగింపు రోజున జరిగిన జాతర ఉత్సవంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గణనాధుని దర్శించుకుని పల్లకి సేవలొ పాల్గొన్నారు. రథోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు లభించాలని కోరారు.

ఈ జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, పాలకవర్గ కమిటీ సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ బి.పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసి రాజు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పొట్లచెరు ప్రభు, సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, పుర ప్రముఖులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ నాయకులు కురుమ వెంకన్న, మాధవరెడ్డి,నర్సింహారెడ్డి,సందీప్ గౌడ్, లక్ష్మారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.