calender_icon.png 30 September, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞానానికి ఆదిదేవతగా శ్రీ విద్యాధరి

30-09-2025 12:00:00 AM

పీఠాధిపతులు శ్రీ విద్యా శంకర భారతి, శ్రీ మాధవానంద సరస్వతి

గజ్వేల్, సెప్టెంబర్ 29: జ్ఞానానికి ఆదిదేవతగా శ్రీ విద్యా సరస్వతి మాత ప్రసిద్ధికెక్కినట్లు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి, శ్రీ గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. మూల నక్షత్ర మహోత్సవం సందర్భంగా వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ విద్యా ధరి క్షేత్రం భక్తులు, ఆరాధకులకు ప్రత్యేక ఆకర్షణగా విలసిల్లుతోందని అన్నారు.

ముఖ్యంగా జ్ఞాన సముపార్జనకు వర్గల్ చదువుల తల్లి సంపూర్ణ ఆశీస్సులు పొందాలని, దీంతో విద్య, నైపుణ్యత, సృజనాత్మకత, లలిత కళలు తదితర లక్ష్యసాధనకు మార్గం సుగమం చేసుకోవాలని ఆకాంక్షించారు. శక్తి స్వరూపంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ విద్యాధరి క్షేత్రo సర్వశక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుందని, ఈ క్రమంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో సేవించాలని వివరించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామీజీలను ఘనంగా సత్కరించారు.