calender_icon.png 30 September, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

30-09-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని మ హాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని, నేటి నుంచి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు.

ఏలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లో సరైన వసతులు కల్పించాలన్నారు. అధికారులను మహాత్మ జ్యోతిబా పాఠశాలలో ఉన్న గదులు, సెక్యూరిటీ, మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.