26-10-2025 12:34:31 AM
సెలవులపై వెళ్లనున్నయోగితా రాణా
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగు తున్న యోగితారాణా నవంబరు 1 నుంచి డిసెంబరు 12వ తేదీ వరకు 42 రోజులపాటు చైల్డ్ కేర్ సెలవులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో కళాశాల విద్యా, సాంకేతిక విద్యా కమిషనర్‌గా ఉన్న శ్రీదేవసేనకు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం అప్పగి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది.- యోగితా రాణా సెలవులు పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగుతారని అందులో సర్కారు పేర్కొంది.