23-12-2025 12:00:00 AM
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నా హక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎన్నికల విభాగం అధికారులతో కలి సి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సర్ సన్నాహక ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ము ఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు చేయనున్న దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దిష్ట గడులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితాలో సరిగా లేని పాత ఫొటోలు, పేర్లు, జెండర్ వంటివి తప్పుగా ఉన్నట్లయితే ఫా రం 8 ద్వారా సవరించాలని సూచించారు. సర్ సన్నాహక ప్రక్రియను వచ్చే జనవరి 13.లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సం దర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే రూరల్ నియోజకవర్గాలలో పూర్తి చేశామని, అర్బన్ సెగ్మెంట్ లో వేగవంతంగా చేపట్టి గడువు లోపు పూర్తి చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.