23-12-2025 12:00:00 AM
బాన్సువాడలో ‘నకిలీ’
కరెన్సీ కలకం
కెనరా బ్యాంకులో పట్టివేత
బయటపడ్డ అభ్యర్థుల లీలలు
బాన్సువాడ, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : పంచాయతీ పోరులో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నకిలీ కరెన్సీనే ఆయుధంగా వాడినట్టు తెలిస్తుంది. రాత్రి వేళల్లో ఇచ్చిన రూ.500 నోట్లు దొంగనోట్లుగా వర్ని కెనరా బ్యాంకులో రుజువయ్యా యని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు లోను చేసేందుకే దొంగ నోట్లను పంపిణీ చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. నకిలీ కరెన్సీ ఇచ్చిన అభ్యర్థులు ఎవరన్న విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్న ట్లు సమాచారం.
నకిలీ కరెన్సీని ఎక్కడి నుంచి తెచ్చారు? ఓటర్లకు ఇచ్చిన అభ్యర్థు లు ఎవరు? ఆయా విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సర్పంచ్ ఎన్నికల్లో రూ.500 దొంగ నోట్లు పంచిన సర్పంచ్ అభ్యర్థులు ఎవరన్నది కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ప్రక్రియకు పూనుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రోజుకోచోట వెలుగులోకి..
దొంగనోట్ల వ్యవహారం రోజుకో చోట వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్లో ఇటీవల దొంగనోట్ల వ్యవహారం బహిర్గతం అవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి పంపిణీ నోట్ల ను ఓ రైతు క్రాప్ లోన్ చెల్లించేందుకు కెన రా బ్యాంకుకు వెళ్లడంతో నకిలీ బండారం బయటపడింది. రైతు ఇచ్చిన నోట్లు దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ అధికారులు విషయాన్ని వెంటనే పోలీసులకు తెలయజేశారు. నకిలీ నోట్లు తీసుకొచ్చిన రైతును పోలీసులు విచారించగా, ఎన్నికల్లో భాగంగా తమకు ఇచ్చిన నోట్లనే తాను క్రాప్లోన్ వడ్డీని చెల్లించేందుకు తెచ్చానని చెప్పినట్లు సమాచారం. కాగా, నకిలీ నోట్లు పంపిణీ చేసిన అభ్యర్థి పంచాయతీ పోరులో గెలిచి సర్పంచి పీఠా న్ని చేజెక్కించుకున్నట్లు తెలిసింది.
పోలీసులపై ఓ కీలక నేత ఒత్తిడి?
సర్పంచ్ పదవి పోటీలో ఉన్న అభ్యర్థులు పారదర్శకంగా ప్రచారాన్ని సాగించి ప్రజల తీర్పు పొందాల్సి ఉండగా, దొంగనోట్లు పం చడం కలకలం రేపుతున్నది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి నకిలీ నోట్లను ఓటర్లకు పంచిపెట్టినట్టు తేలడంతో పోలీసులు ఈ అంశంపైన దృష్టిసారించారు. ఇటీవల ఓ రైతు క్రాప్లోన్ వడ్డీ చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లగా దొంగ నోట్ల వ్యవహారం బయటికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు రైతు ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. దీంతో రూ.2.80 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. వీటిని ఎన్నికల సమయంలో ఓటర్ల కు పంచేందుకు తెచ్చినట్టు తెలిసింది. ఈ లోగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం బయటికి పొక్కకుండా ఓ కీలక నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
విచారణ ముమ్మరం..
డబ్బులు తెచ్చిన రైతుకు ఆ నకిలీ కరెన్సీ ఎవరిచ్చారు? అన్న వాస్తవాలను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ నకిలీ నోట్లు ఎవరు తెచ్చారు? ఎక్కడినుంచి తెచ్చారు? ఎ న్ని లక్షల నోట్లు తెచ్చారు? ఎక్కడ వీటిని ప్రింట్ చేశారు? ఒకవేళ ఇంత పెద్ద మొత్తం లో దొరికిన నకిలీ నోట్లు ఎక్కడినుం చి వచ్చాయన్న వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సమగ్రంగా విచారణ జరిపితే అసలైన దోషులు బయటపడే అవకా శాలు ఉన్నాయి. ఒక్క జలాల్‌పూర్‌కే నకిలీ నోట్లు వచ్చాయా? లేదా ఇతర మండలాల్లో కూడా నకిలీ నోట్లు వచ్చాయా? అన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ముఠా బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు డిమాండ్ చేస్తున్నారు.