18-07-2025 12:00:00 AM
అడిషనల్ కలెక్టర్ రాంబాబు
నూతనకల్ జూలై 17: ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణంతో నీటి వృధాను అరికట్ట వచ్చునని, భూగర్భ జలాలను కూడా పెంచవచ్చునని ఆయన అన్నారు.
నేటి ఇంకుడుగుంతలే భవిష్యత్తరాలకు జల వనరులని,వాటిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గ్రామాల్లో వ్యక్తిగత కమ్యూనిటీ తరహాలో ఇంకుడు గుంతల నిర్మాణం మంజూరు చేసుకోవచ్చని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమం లో ఎంపీడీవో సునీత,ఏపీవో శ్రీరాములు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.