calender_icon.png 15 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్

15-07-2025 12:55:25 AM

స్టార్ హాస్పిటల్స్‌లో ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలి నాన క్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్‌లో గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్ట ర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. “ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.

మన దేశంలో 50 మధ్య గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణం కావచ్చు. అం దుకే స్టార్ హాస్పిటల్ హార్ట్ ఫేయిల్యుర్ కార్యక్రమం ప్రారంభించింది” అని చెప్పారు. అనంతరం అడ్వాన్స్‌డ్ హార్ట్ ఫెయిల్యూర్, ట్రాన్స్‌ప్లాంట్ కార్డియలోజిస్ట్ డాక్టర్ సురేష్ ఎర్ర మాట్లాడుతూ.. “భారతదేశంలో ముఖ్యంగా పని చేసే వయస్సు వారిలో గుండె వైఫల్యం కేసులు గణనీయంగా పెరు గుతున్నందున స్టార్ హాస్పిటల్స్ ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్‘ క్లినిక్‌ను ప్రారంభించింది.

దేశ ంలో సుమారు 8-10 మిలియన్ల మందికి గుండె సంబంధిత వ్యాధులున్నాయి. ఏటా 1.8 మిలియన్ల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణలో 2022లో 282 గుం డె మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ మంది 30 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఉన్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న రక్తపోటు, మధుమే హం, ఊబకాయం, ఒత్తిడి కారణంగా ఇది గుండె సంబంధిత ప్రమాదాలకు కేంద్రంగా మారింది” అని అన్నారు.