calender_icon.png 12 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

12-08-2025 12:33:34 AM

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 11 (విజయక్రాంతి) జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, పలు ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కలికోట నుండి కుడి ఎడమ కాల్వల నిర్మాణ పనులు, మల్కాపేట రిజర్వాయర్ ఎడమ కాలువ కోసం భూ సేకరణ, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ప్రోజెక్టు పనులు, కోనరావుపేట మండల పరిధిలోని లచ్చాపేట తండా రిజర్వాయర్ కాలువ పనులు, చందుర్తి మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి కొచ్చేరువు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులొకి నిటితో నింపే ఏర్పాట్లు తదితరాంశాలపై చర్చించారు.

ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఎలాంటి ఆలస్యం లేకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు.అలాగే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టుల అమలులో పారదర్శకత పాటించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకత పెరగడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.ఈ సందర్భంగా అధికారుల నుండి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు... ఈ సమావేశంలో సీఈ సుధాకర్ రెడ్డి, ఈఈ, ఇంజనీరింగ్ అధికారులుపాల్గొన్నారు..