calender_icon.png 12 August, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీకి నోటీస్ ఇవ్వడం తగదు

12-08-2025 12:32:40 AM

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

 పరిగి, ఆగస్టు 11 ( విజయక్రాంతి): లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి నోటీసులు ఇవ్వడం సరైంది కాదని డిసిసి అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పరిగి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారం సాధించడంలో వోట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తగు సాక్షాలు మీడియా ముందు వ్యక్తపరిచారని గుర్తు చేశారు.

మహారాష్ట్ర లో ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు ఓటర్ లిస్ట్ లో నమోదు చేశారని, సరైన ఇంటి అడ్రస్ లేకుండా కొన్ని వేల ఓట్లు అదేవిధంగా ఒకే వ్యక్తికి చెందిన నాలుగైదు ఓట్లు చేసి ఎన్నికల్లో గెలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారని తెలిపారు.ఒక పార్లమెంట్ పరిధిలో లక్ష ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నట్టు గుర్తించి వాటిని సాక్షాధారాలతో సహా రాహుల్ గాంధీ మీడియా ముందు పొందుపరచగా వారికి ఎలక్షన్ కమిషన్ నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

బిజెపి సుమారు 25 సీట్లలో ఇలాంటి చర్యలు చేపట్టి అధికారంలోకి వచ్చిందని ఆ 25 సీట్లలో బిజెపి అతితక్కువ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.భారత ఎన్నికల సంఘం ఓటర్ లిస్టును డిజిటల్ రూపంలో ఇవ్వకుండా ప్రింట్లలో ఇచ్చి ఈ విషయాన్ని లోతైన పద్ధతుల్లో విశ్లేషించకుండా అడ్డుకుంటుందని బిజెపి పార్టీతో కుమ్మక్కై బిజెపిని అధికారంలో తేవడానికి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని రాహుల్ గాంధీ నిర్దిష్టమైన ఆరోపణ ఈ ఆరోపణను ఖండించి నిరాధారమైన ఆరోపణ అని నిరూపించాల్సిన ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ కి నోటీసులు ఇస్తే కాంగ్రెస్ తరపున పెద్ద ఉద్యమాలు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ,పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్,డిసిసి ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ,డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడుముల వెంకటేష్, ఆంజనేయులు, గన్నేమోని శ్రీనివాస్, తౌరియా నాయక్, గోపాల్, మహిపాల్, సత్యనారాయణ, సర్వర్, ఆనంద్, అయూబ్,నాగవర్ధన్, తదితరులుపాల్గొన్నారు.