13-01-2026 12:40:33 AM
మంథని, జనవరి 22(విజయ క్రాంతి) మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిలుస్తున్నారు. సోమవారం మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. స్టేజిపై ఇటు ముస్లింలకు అటు క్రైస్తవులకు, హిందూ దేవాలయాలకు అభివృద్ధి నిధులను మంజూరు చేస్తూ, ఒకే స్టేజీపై వివిధ మతాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిరుపేద లందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.