calender_icon.png 29 September, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌హెచ్‌ఓలకు వరంగా మారిన స్టేషన్ బెయిల్

29-09-2025 12:17:12 AM

  1. జిల్లాలో పోలీస్ అధికారుల కేమైంది? 
  2. లంచావతారం ఎత్తుతున్న రక్షకబటులు
  3. ఈ పాపం ఎవరిది? 
  4. ఏసీబీ ట్రాప్‌లో మణుగూరు ఎస్త్స్ర, 
  5. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల్వంచ, చుంచుపల్లి ఎస్త్స్రలు 
  6. జిల్లాలో స్టేషన్‌లు వేరైనా తీరు ఒక్కటే

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సామాన్య మానవుడికి పోలీస్ స్టేషన్లో న్యా యం నేతి బీరకాయలో నెయ్యి చందాన మా రిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఆరోపణలకు అనుగుణంగానే తాజాగా మణు గూరు ఎస్త్స్ర ఏసిబి ట్రాప్ లో చిక్కడం, పా ల్వంచ పట్టణ ఎస్‌ఐ సుమన్, చుంచుపల్లి ఎస్త్స్ర అడ్డగోలు వసూళ్లు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి .

కాసుల వేటలో ఖాకీ లు అనే విధంగా మారిందని తేటతెల్లమవుతుంది. రెండు నెలల క్రితం మణుగూరు సిఐ రూ 4లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అదే తరహాలో తాజాగా మణుగూ రు ఎస్త్స్ర రంజిత్ రూ 40 వేలు లంచం తీసుకుండు ఏసీబీకి దొరికాడు. దీం తో అవినీతికీ కేరాఫ్ పోలీస్ స్టే షన్లు అన్న చందాన మారినట్లు స్పష్టమవుతుంది. కొందరి అక్రమార్జన కారణంగా పోలీస్ డిపా ర్ట్మెంట్ యావత్తు ప్రజల్లో పలుచన ఆ వుతోంది. తప్పు చేసిన వారితో ఊచలు లెక్క పెట్టించే రక్షక భటులే లంచావతారాలుగా మారుతున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. 

వరంగా మారిన స్టేషన్ బెయిల్ 

ఏ కారణం చేతనైనా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయితే ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ,కొన్ని సం దర్భాల్లో ఎస్ హెచ్ ఓ గా పనిచేస్తున్న అధికారి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుం ది. అదే అదునుగా నిందితుడి నుంచి భారీ మొత్తంలో నజరానాలు దండుకుంటున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.

మణు గూరు లో ఓ కేసు విషయంలో తల్లాడ కు చెందిన ఇద్దరు వ్యక్తుల కు స్టేషన్ బెల్ ఇచ్చేందుకు ఎస్త్స్ర రూ 40 వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. పాల్వంచ ఎస్త్స్ర సుమన్ ఇదే తరహా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. స్టేషన్ బె యిల్ పోలీసులకు వరంగా మారిందనే ఆరోపణ ధ్రువపడుతోంది. ఉన్నతాధికారులు స్టేషన్ బెయిల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సా రించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.

చుంచుపల్లి ఎస్త్స్ర మరో తర హా అడ్డగోలు వసూళ్లకు పాల్పడినట్లు తాజా గా వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే వారిపై దాడి చేసి డబ్బులు లాక్కునే పరిస్థితికి వచ్చిందంటే సామాన్య మానవుడికి దిక్కెవరు. పోలీస్ శాఖలో కొంతమంది అవినీతి, అక్రమార్కుల కారణంగా వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిల్లే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అక్రమార్కులు, అవినీతి అధికారులపై కొరడా జులిపించి పోలీస్ శాఖ పై ప్రజలకు నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ పాపం ఎవరిది? 

గతంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వ శాఖల్లో అధికారులను అవినీతి మచ్చలేని వారిని, నిబద్ధతతో పనిచేసే అధికారులను సిఫారసు చేసేవారు. ప్రస్తుతం ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని సి ఫారసు చేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర స్థాయి అధికారుల నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు పోస్టింగ్ పొందాలంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అ డిగినంత చెల్లిస్తేనే పోస్టింగు లభిస్తుందని తెలుస్తోంది. 

పోస్టింగ్ కోసం చెల్లించిన నజరానా కు నాలుగు , ఐదు రెట్లు సంపాదించే మార్గం పైనే అధికారులు దృష్టి సారిస్తున్నారని, శాంతి భద్రతలపై, సామాన్య మానవునికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజ ల చేత, ప్రజల కొరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరే సామాన్య మానవునికి గుది బండగా మారిందనే ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ల నుంచి మొదలుకొని మారుమూల ప్రాంతాల్లో గల పోలీస్ స్టేషన్ల వరకు ఎవరి స్థాయిలో వారు లంచావతారాలుగా తలెత్తుతున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ పాపం ఎవరిది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది.