01-12-2024 02:19:58 AM
ఎంపీ కడియం కావ్య
భీమదేవరపల్లి, నవంబర్ 30: సోషల్ మీడియాకు బాలలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని కాళోజీ క్షేత్రంలో శనివారం బాల ల హక్కుల వారోత్సవాలను నిర్వహించగా ఎంపీ హాజరై మాట్లాడారు. బాలల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సంబర్ 1098ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. బాలల హక్కులపై అవగాహన కల్పించాలన్నారు.
చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ ను వెలికితీస్తే అద్భుతాలు చేస్తారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఈసీ మెంబర్ శ్రీనివాస్, వివిధ పాఠశాలకు చెందిన 800 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.