calender_icon.png 15 November, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వనరులు జీవకోటికి ప్రాణాధారం

01-12-2024 02:23:25 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): సమస్త జీవకోటికి నీటి వనరులు ప్రాణాధారమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. నగరంలోని హోటల్ తాజ్ వివంతాలో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ప్రజావసరాలకోసం కేటాయిం చిన స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు  ఆక్రమణలకు గురికాకుండా చూడటం హైడ్రా ప్రధాన విధి అని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణలో హైడ్రా చర్యలను నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చైర్మన్ సీ అచలేందర్ రెడ్డి అభినందించారు. రిటైర్డ్ ఐఏఎస్ శోభ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఐఎఫ్‌ఎస్ అధికారి సువర్ణ చంద్రప్పగారి, యూఎన్‌డీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌంద్రపాణి పాల్గొన్నారు.