01-12-2024 02:18:58 AM
కామన్వెల్త్ కరాటే పోటీల్లో కాంస్యం కైవసం
మలక్‌పేట, నవంబర్ 30: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన 11వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌లోనగరానికి చెందిన యువతి ఫరీదా సుల్తానా కాంస్య పతకం సాధించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు డర్బన్‌లోని ఆలివ్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ పోటీలో ఫరీదా సుల్తానా 21 సంవత్సరాల కిలోల విభాగంలో ఫిమేల్ కుమైట్‌లో ఇండియా తరపున బరిలోకి దిగి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ పోటీల్లో 16 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కామన్వెల్త్ కరాటే ఫెడరేషన్ అధ్యక్షుడు హన్షి సోనీ పిళ్లు నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించారని పాకో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఎండీ ఇఫ్త్తెకార్ తెలిపారు. ఫరీదా సుల్తానా బ్లాక్ బెల్ట్ 1వ డాన్ గత 8 సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ పొందుతున్నట్లు ఇఫ్త్తెకార్ తెలిపారు.